Nayanthara Vignesh at Tirumala : వివాహం తర్వాత భర్తతో కలిసి తిరుమలకు నయనతార| ABP Desam

2022-06-10 14

Nayantara-Vignesh Shivan వివాహం తర్వాత నేరుగా తిరుమలకు చేరుకున్నారు. మహాబలిపురంలో వివాహం తర్వాత తిరుమలకు చేరుకుని కల్యాణోత్సవ సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాధారణ భక్తులతో కలిసి క్యూలైన్స్ లో నిలబడి స్వామి వారి సేవకు వెళ్లారు. ఆలయంలో స్వామి వారి కల్యాణోత్సవంలో పాల్గొన్న తర్వాత వేదపండితులు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించారు. స్వామి వారి శేషవస్త్రంతో టీటీడీ అధికారులు విఘ్నేష్ నయన తార దంపతులను సత్కరించారు. ఆలయం బయటకు వచ్చాక ఎండ ఎక్కువగా ఉండటం...భక్తుల తాకిడితో విక్కీ నయన్ చాలా సేపు ఇబ్బంది పడాల్సి వచ్చింది.